కరోనా వారియర్స్ కు ఇన్సెంటివ్ ఇయ్యట్లే

కరోనా వారియర్స్ కు ఇన్సెంటివ్ ఇయ్యట్లే

కొందరికి నెల.. ఇంకొందరికి రెండు నెలలే ఇచ్చిన్రు
కోవిడ్‍ బారిన పడ్డ వేలాది మెడికల్‍, పోలీస్‍సిబ్బంది
ఐదునెలలుగా కరోనా డ్యూటీలతో అలసిపోయిన్రు
కాంట్రాక్ట్, ఔట్‍సోర్సింగ్‍ ఎంప్లాయిస్‍పై చిన్నచూపు
ఉద్యోగులను కష్టకాలంలో ఆదుకోని రాష్ట్ర సర్కార్

‘‘వైరస్‍ సోకుతుందని తెలిసి కూడా వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. స్వీపర్‍ నుంచి హెల్త్డైరెక్టర్‍ వరకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ప్రతి వీధిని శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కార్మికులకు పాదాభివందనం చేస్తున్నా. వైద్య సిబ్బందికి గ్రాస్‍ శాలరీలో పది శాతం సీఎం గిఫ్ట్ కింద ఇస్తం. మున్సిపల్‍ శానిటరీ సిబ్బందితో పాటు వాటర్‍ బోర్డ్లో కార్మికులుగా ఉన్న 94,392 మందికి కూడా ఈ గిఫ్ట్ ఇస్తం. గ్రేటర్‍ కార్పొరేషన్‍, వాటర్‍ బోర్డు సిబ్బందికి రూ.7,500 చొప్పున, మున్సిపల్‍, పంచాయతీ కార్మికులకు రూ.5 వేల చొప్పున వెంటనే అందజేస్తం. దీంతోపాటు 60 వేల మంది పోలీసులు పగలు రాత్రీ డ్యూటీ చేస్తున్నరు. వారికి ప్రోత్సాహం అందించే విషయాన్ని పరిశీలిస్తం’’.
‑ ఏప్రిల్‍6న విలేకరుల సమావేశంలోసీఎం కేసీఆర్‍

‘‘పోలీస్‍ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నరు. ఎండనక, వాననక 24 గంటలు లైఫ్‍ రిస్క్ చేసి డ్యూటీలో ఉంటున్నరు. టైమ్‍కు తిండికూడా తింటలేరు. కరోనా పోరాటంలోవాళ్లు కూడా ముందుంటున్నరు.పోలీసులకు గ్రాస్‍శాలరీపై అదనంగా 10శాతం సీఎం గిఫ్ట్ కింద డబ్బులుఇస్తం’’.
‑ ఏప్రిల్‍19న విలేకరుల సమావేశంలోసీఎం కేసీఆర్

వరంగల్‍రూరల్‍, వెలుగు: మెడికల్‍, శానిటేషన్‍, మున్సిపల్‍, పంచాయతీ, వాటర్‍ బోర్డు, పోలీస్‍ సిబ్బంది కరోనా కట్టడిలో వారియర్స్ గా పనిచేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పొగిడారు. ప్రాణాలను పణంగా పెట్టిడ్యూటీలు చేస్తున్న వీరికి అదనంగా 10 శాతం సీఎం గిఫ్ట్ కింద ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారంతా ఖుషీ అయ్యారు. ఏప్రిల్‍ నెలకు సంబంధించిన బోనస్‍ మే నెల జీతంతో కలిపి అకౌంట్లలో వేశారు. కొన్ని శాఖల్లో మాత్రం రెగ్యులర్‍ ఉద్యోగులకు రెండు నెలలు ఇచ్చారు. గత 3 నెలలుగా బోనస్‍ కోసం ఎదురుచూస్తున్న ఎంప్లాయిస్‍ డల్‍ అయ్యారు.

లైఫ్‍ రిస్క్ డ్యూటీల్లో..మెడికల్‍ టీం
కనపడని శత్రువు కరోనా వైరస్‍పై సమరం అనగానే గుర్తొచ్చేది వైద్య సిబ్బంది. రెగ్యులర్‍, కాంట్రాక్ట్, ఔట్‍సోర్సింగ్‍ అనే తేడా లేకుండా ఉద్యోగులంతా తీరిక లేకుండా ఐదు నెలలుగా డ్యూటీలు చేస్తున్నారు. రెగ్యులర్‍ ఎంప్లాయిస్‍ కంటే కాంట్రాక్ట్, ఔట్‍సోర్సింగ్‍ ఎంప్లాయిస్‍ ఇంకింత ఎక్కువ రిస్క్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మెడికల్‍ ఆఫీసర్స్, ల్యాబ్‍ టెక్నిషీయన్‍, క్లర్క్, ఎంఎన్‍వోలు కరోనా టెస్టులు, చికిత్సల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శాలరీ మాత్రం రెగ్యులర్‍ ఉద్యోగులతో పోల్చితే చాలా డిఫరెన్స్ ఉంది. మెడికల్‍ సిబ్బందిలో ఫుల్‍ టైం ఎంప్లాయిస్‍కు రెండు నెలల బోనస్‍ ఇవ్వగా.. కరోనా డ్యూటీలే చేస్తున్న ఎక్కువ మంది ఇతర సిబ్బందికి కేవలం ఒకే నెల ఇన్సెంటివ్‍తో సరిపుచ్చారు. కరోనా బాధితులకు సర్వీస్‍ చేస్తూ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.

మున్సిపాలిటీల్లో.. పబ్లిక్‍ హెల్త్ స్టాఫ్‍ ఓన్లీ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ సిబ్బందికి సైతం 10 శాతం బోనస్‍ ఇస్తామని చెప్పినా అది ఆ శాఖలోని పబ్లిక్‍ హెల్త్ స్టాఫ్‍ వరకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో భాగమైన ఆపరేటర్లు, మెకానిక్‍, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, బిల్‍ కలెక్టర్లు, హెల్త్ అండ్‍ రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు కనీసం ఒక్క నెల కూడా ఇవ్వలేదు. గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధి వాటర్‍ బోర్డులో సేవలు అందించేవారికి ఈ ఇన్సెంటివ్‍ ఇస్తుండగా.. వందలాది మున్సిపాలిటీల్లో అదే తరహాలో సేవలు అందించే సిబ్బందికి మాత్రం రూపాయి కూడా అందించట్లేదు.

కరోనా కోరల్లో ఖాకీలు
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‍ స్టేషన్లన్నీ కరోనా బారినపడ్డాయి. రెగ్యులర్‍ డ్యూటీలకు తోడు బందోబస్తు, ధర్నాలు, రాస్తారోకోల సందర్భంగా డ్యూటీల్లో పాల్గొన్న వేలాది మంది పోలీసులు కరోనా బాధితులయ్యారు. మెడికల్‍, శానిటేషన్‍ సిబ్బందికి సెక్యూరిటీగా ఎంతోకొంత మాస్కులు, శానిటైజర్లు ఉండగా.. పోలీసోళ్లకు అవీ లేవు. రోడ్లమీద నిరసనలు చేస్తున్న వారిని పోలీసుస్టేషన్లకు తరలించే సమయాల్లో వైరస్ బారిన పడుతున్నారు. ప్రతి పోలీస్‍స్టేషన్‍కు మొన్నటివరకు నెలకు ఐదు లీటర్ల చొప్పున శానిటైజర్‍ అందించినా.. ఇప్పుడు చాలా స్టేషన్లకు అది అందడం లేదు. డ్యూటీలో ఉన్న వారికి గతంలో ఇచ్చిన జింకోవిట్‍, సీ విటమిన్‍, మల్టీ విటమిన్‍ టాబ్లెట్లు , మాస్కులు, శానిటైజర్లు ఇప్పుడు ఇవ్వడంలేదు. కరోనా పాజిటివ్‍ వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇవ్వాలని డీజీపీ ఆర్డర్ ఇచ్చినా అది ఇంకా అమలు కావడంలేదు.

ఆపద సమయంలోఅండగాఉండట్లే
ప్రభుత్వం 10 శాతం బోనస్‍ ప్రకటించినప్పటితో పోలిస్తే.. ఇప్పుడే కోవిడ్‍ వ్యాప్తి పెరిగింది. మూడు నెలల క్రితం ఒకటోరెండో కరోనా కేసులుండగా.. ఇప్పుడు వందలాది కోవిడ్‍ కేసుల మధ్య డ్యూటీ చేస్తున్నారు. యాంటి జెన్‍ టెస్టుల మొదలు.. కోవిడ్‍ బారినపడ్డవారిని క్వారంటైన్‍ కు తరలించడం, రెండు వారాలు అక్కడ సేవలు అందించడం, కరోనా మృతులకు అంత్యక్రియలు చేపట్టడంవంటి సేవలు ఇప్పుడే రెట్టింపయ్యాయి. డ్యూటీల్లో ఉన్న ఉద్యోగులకు అదేస్థాయిలో కరోనా వైరస్‍ అంటింది. ఇలాంటి ఆపద సమయంలో అండగా ఉండి ప్రోత్సహించాల్సిన సర్కారు.. ఒక్కొక్కరిగా బోనస్‍ ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి.

For More News..

కట్టకముందే కూలుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు

కరోనాకు భయపడి పిల్లల్ని వద్దనుకుంటున్న కొత్త జంటలు

టిక్ టాక్ బ్యాన్ చేసిన అమెరికా