పీఆర్సీ పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వం

పీఆర్సీ పదవీ కాలాన్ని  పొడిగించిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణ సంఘం(పీఆర్సీ) పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో పీఆర్సీ పదవీ కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడగించించిన ప్రభుత్వం.. మరోసారి ఆరు నెలలు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పీఆర్సీ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎన్.శివశంకర్ నేతృత్వంలోని కమిటీ రిపోర్టు సమర్పణలో ఆలస్యం కారణంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి నివేదికను సమర్పించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది.