ట్రాన్స్​కో, జెన్​కోలో కొత్త డైరెక్టర్లను నియమించండి

ట్రాన్స్​కో, జెన్​కోలో కొత్త డైరెక్టర్లను నియమించండి
  •     చట్టపరంగా ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ట్రాన్స్​కో, జెన్​కోలో కొత్తగా డైరెక్టర్లను నియామించాలని ఆయా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శనివారం సీఎండీలకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు విద్యుత్​సంస్థల్లో డైరెక్టర్ల నియామక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని, చట్టపరంగా కొత్త నియమాకాల ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.

జీవో నంబర్లు.. 18, 45 ప్రకారం డైరెక్టర్లుగా నియమించే వాళ్లు రెండేడ్ల పాటు పదవిలో కొనసాగాలని ఆ తర్వాత ఏడాది చొప్పున రెండుసార్లు మాత్రమే వారి పదవీ కాలాన్ని పొడిగించాలని తెలిపింది. గరిష్టంగా ఒక్కొక్కరు నాలుగేండ్లకు మించి పదవుల్లో కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేసింది. టీఎస్​ట్రాన్స్​కో, జెన్​కో  సీఎండీలు తగిన చర్యలు చేపట్టి, కొత్త డైరెక్టర్ల నియమానికి నోటిఫికేషన్​వెంటనే జారీ చేయాలని సూచించింది.