ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్

 ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఢిల్లీలో పరిస్థితి తెలంగాణలో రాకుండా ఎయిర్ పొల్యూషన్ నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు ప్రభుత్వం మంచి ఈవీ పాలసీని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఈ - వాహనాలను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకోసం  రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఈ ఛార్జింగ్ స్టేషన్లను  ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలను కొనేలా వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతిప్రతినిధులు కూడా ఈవీ వాహనాలను వాడాలను మంత్రి కోరారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోపాటు అన్ని జిల్లాల కలెక్టరేట్లతో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈవీ వాహనాలను ప్రోత్సహించే విధంగా  ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 

పొల్యూషన్ కట్టడిలో భాగంగా పాత వాహనాలను  రద్దు చేసేందుకు స్క్రాప్ పాలసీని  తీసుకొచ్చిందన్నారు మంత్రి.  రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలున్నాయి.. వాహనాల పొల్యూషన్ చెకింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 550 పొల్యూషన్ టెస్టింగ్  స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో 15 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

మరోవైపు 15 ఏళ్ల పైబడిన పాత వాహనాలను స్క్రాప్  చేస్తున్నట్లు ప్రకటించారు.  ఆర్టీసీ వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా స్క్రాప్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ వాహనాలకు గ్రీన్ టాక్స్ పేరుతో వెసులుబాటు కల్పించామన్నారు. అయితే ఈ ప్రైవేట్ వాహనాల వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ వెసులుబాటుతో కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నట్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.