పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తాం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తాం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

నస్పూర్, వెలుగు: ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. బుధవారం నస్పూర్ మండల పరిధిలోని విలేజ్ నస్పూర్, సీతారాంపల్లి ప్రభుత్వ హైస్కూల్​కు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 ల్యాప్​టాప్​లు, 43 ఇంచ్ ఎల్ఈడీ స్క్రీన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందించారు. విద్యార్థులకు కంప్యూటర్ బోధనకు ఇన్​స్ట్రక్టర్​ను ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించా లనే సంకల్పంతో ఉచితంగా డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని  తెలిపారు. 

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని మొత్తం 12 స్కూళ్లలో డిజిటల్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక లీడర్లు కమలాకర్ రావు, రమేశ్, బియ్యాల సతీశ్ రావు, ఈర్ల సదానందం, బద్రి శ్రీకాంత్, కట్కూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.