ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి.. తిర్యాణిలో 6.3 డిగ్రీస్

ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి.. తిర్యాణిలో 6.3 డిగ్రీస్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను చలి మళ్లీ వణికిస్తొంది. గత వారంరోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రెండు రోజులుగా మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం తిర్యాణి మండలం గిన్నెదరిలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

సిర్పూర్(యూ) మండలంలో 6.8 డిగ్రీలు, కెరమెరి మండల కేంద్రంలో 8.0 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలి తీవ్రత,   చల్లటి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఇంటినుంచి బయటకు వెళ్లి సాయంత్రం 5 గంటల లోపే ఇంటికి చేరుకుంటున్నారు.