నిర్మల్, వెలుగు: ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను రూపొందించారు.
ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రజలు నిర్మల్ ఉత్సవాలపై తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించాలని ఆమె కోరారు. నిర్మల్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
