బస్సు ప్రమాద మృతుల ఫ్యామిలీలకు.. రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేత

బస్సు ప్రమాద మృతుల ఫ్యామిలీలకు..  రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేత

గద్వాల, వెలుగు: ఈ నెల 24న ఏపీలోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ప్రైవేట్  ట్రావెల్  బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు చనిపోగా, వారి ఫ్యామిలీలకు ప్రభుత్వం ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. ఆదివారం గద్వాల ఆర్డీవో అలివేలు కర్నూల్  ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్కులు అందజేశారు. 

చందన మంగ, సంధ్యారాణి(హైదరాబాద్), మేఘనాథ్(కోదాడ), అనూష(నల్గొండ), బొంత ఆదిశేషగిరిరావు(హైదర్​గూడ), కెనుగ దీపక్ (రాయగడ్) కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీవో నాగేంద్రం, ఎర్రవల్లి తహసీల్దార్  నరేశ్​ పాల్గొన్నారు.

డెడ్ బాడీలు అప్పగింత..

మెదక్: కర్నూల్​లో ప్రైవేట్ బస్ ప్రమాదంలో చనిపోయిన తల్లీకూతుళ్ల డెడ్ బాడీ లను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్  దగ్ధమైన ఘటనలో మెదక్  మండలం శివాయిపల్లికి చెందిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి, చందన సజీవ దహనమయ్యారు. డెడ్ బాడీలు గుర్తు పట్టలేని పరిస్థితి ఉండడంతో, వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకొని, డెడ్ బాడీలతో సరిపోల్చిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రి వరకు డెడ్ బాడీ లు శివాయిపల్లికి చేరుకునే అవకాశం ఉంది. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.