కొత్తగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ

కొత్తగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ
  • సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్తు
  • వచ్చే అకాడమిక్ ఇయర్​లో ప్రారంభం
  • సర్కార్ బడుల్లో పెరగనున్న ఎన్​రోల్​మెంట్
  • సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది. సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు లేకపోవడంతో పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారని, అందువల్లే సర్కారు బడుల్లో ఎన్​రోల్​మెంట్ తగ్గిపోతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే దశలవారీగా ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 

కాగా, ఈ క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరింది. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించేందుకు చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఒకటో తర గతి నుంచే క్లాసులు ప్రారంభమవుతున్నాయి. కానీ, మారుతున్న పరిస్థితుల్లో పేరెంట్స్ వారి పిల్లలను మూడేండ్ల నుంచే నర్సరీ క్లాసులకు ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లోనూ ఆరేండ్లలోపు పిల్లలకు పౌష్టికాహారంతో పాటు బడులకు సిద్ధం చేస్తున్నారు. 

అంగన్​వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది పిల్లలు ఉంటున్నా, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సర్కారు బడుల్లో చేరుతున్నారు. ప్రైవేట్​బడులు నర్సరీ, ఎల్​కేజీ, యూకేజీ క్లాసులతో ఆకట్టుకోవడమే దీనికి కారణం. దీంతో సర్కారు బడుల్లోనూ నర్సరీ, యూకేజీ, ఎల్​కేజీ క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్, టీచర్ల నుంచి కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నది. తెలంగాణ విద్యా కమిషన్ కూడా ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని సిఫార్సు చేసింది. వచ్చే 2025–26 విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల నుంచే ప్రీ ప్రైమరీ క్లాసులు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రైమరీ స్కూళ్లలో చేరేలా ప్లాన్ చేస్తున్నది.

అంగన్ వాడీ పిల్లలకే క్లాసులు

ప్రస్తుతం 25 వేలకు పైగా అంగన్ వాడీ కేంద్రాలుండగా, 21 వేలకు పైగా బడుల్లో ప్రైమరీ క్లాసులు కొనసాగుతున్నాయి. ఒకే ఆవరణలో ఈ రెండు ఉన్నవి సుమారు 7వేలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగా కో లొకేటెడ్ ఏరియాల్లో అధికారులు ప్రారంభించారు. వెయ్యి చోట్ల స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో జిల్లాలో 20 నుంచి 50 వరకు బడులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఆయాతో పాటు ఇన్ స్ర్టక్టర్ ను కేటాయించనున్నారు. 

వారికి విద్యాశాఖ నుంచే జీతాలు చెల్లించనున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లల ఏజ్​కు అనుగుణంగా ప్రీ ప్రైమరీ క్లాసులు బోధించనున్నారు. వీరిద్దరూ అక్కడి ప్రైమరీ స్కూల్ పరిధిలో పనిచేసేలా ప్లాన్ రెడీ చేశారు. ఇలా ఒక్కో స్కూల్​కు రూ.2 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. దీని నుంచి ఇద్దరి జీతంతో పాటు పిల్లలకు ఆట వస్తువులు, ఇతర పరికరాలు కొనుగోలు చేయనున్నారు.

కేంద్రం ఆధ్వర్యంలో 362 బడుల్లో..

రాష్ట్రంలో పలు బడుల్లో ఇప్పటికే ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహాయంతో సమగ్ర శిక్ష కింద 250 స్కూళ్లు గతేడాది ప్రారంభమయ్యాయి. వీటికి ఏటా రూ.2 లక్షల చొప్పున కేంద్రం అందిస్తున్నది. మరోపక్క పీఎం శ్రీ కింద కొనసాగుతున్న మరో 112 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నా యి.

 ఈ స్కూళ్లకు మాత్రం రూ.5లక్షల చొప్పు న అందజేస్తున్నది. 2025–26లో సమగ్ర శిక్ష కింద 210 ప్రీ ప్రైమరీ బడులు ప్రారంభించేం దుకు కేంద్రం అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభు త్వం ప్రారంభించ తలపెట్టిన 1,000 బడు ల్లోనే ఇవీ ఉన్నాయి. అయితే, కేంద్రం కొత్తగా ప్రతిపాదనలు పంపించిన ప్రీ ప్రైమరీ బడు లకు అనుమతి ఇస్తుందా.. లేదా.. చూడాలని అధికారులు చెప్తున్నారు.