ఆసిఫాబాద్, వెలుగు: ప్రజలు సంక్రాంతి పండగకు ఊరికి వెళ్తే పోలీసులకు తప్పనిసరి గా సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులు లాకర్లలోనే భద్రపర్చుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు. పండుగ సె లవుల్లో ఇండ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లేవారు, వెళ్లే ముందు తప్పనిసరిగా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు, బీట్ పోలీస్ అధి కారికి సమాచారం అందించాలన్నారు. పండుగ
సమయంలోచాలా మంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తారని, ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నా రు. ముందుగానే పోలీసులకు సమాచారమిస్తే. పెట్రోలింగ్లో భాగంగా సిబ్బంది ఆయా ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. ఊర్లకు వె ళ్లేటప్పుడు నగదు, బంగారం, విలువైన వస్తువు లను ఇంట్లో ఉంచొద్దని, బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవడం ఉత్తమమని సూచించారు.
