తిర్యాణి, వెలుగు: ఆసిఫాబాద్జిల్లా తిర్యాణి మండలంలోని మొర్రిగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల అటవీ శాఖ ద్వారా పంపిణీ చేసిన మాస్కులు, విజిల్స్ను తప్పనిసరిగా వినియోగించాలన్నారు.
అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, పంట పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లి శబ్దాలు చేస్తూ ఉండాలని సూచించారు. పులి సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
