రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి : డీఎస్పీ వహీదుద్దీన్

రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి :  డీఎస్పీ వహీదుద్దీన్

కాగజ్ నగర్, వెలుగు: రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని డీఎస్పీ వహీదుద్దీన్ కోరారు. కాగజ్ నగర్ మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం, మల్టీ డయాగ్నస్టిక్ ఆరోగ్య శిబిరాన్ని అగ్రసేన్ భవన్‌లో నిర్వహించారు. డీఎస్పీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్వాడీ యువ మంచ్ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.

 స్థానిక యువత రక్తదానం చేయగా సేకరించిన యూనిట్లను జీవన్ ధార్​ బ్లడ్ బ్యాంక్ కు అందించారు. దాదాపు 200 మందికి డయాగ్నోస్టిక్ పరీక్షలు చేశారు. తహసీల్దార్ మధుకర్, సీఐ ప్రేమ్ కుమార్, బీజేపీ లీడర్  కొత్తపల్లి శ్రీనివాస్, యువ మంచ్ అధ్యక్షుడు అరుణ్ లోయ,సెక్రటరీ అభిషేక్ అసావా, సభ్యులు పాల్గొన్నారు.