మంచిర్యాల, వెలుగు: హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కమాండెంట్ పి.వెంకటరాములు క్రీడాజ్యోతి వెలిగించి మీట్ ను ప్రారంభించారు. బెటాలియన్ పరిధిలోని అన్ని కంపెనీల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఆయా కంపెనీ క్రీడాకారుల కాంటింజెంట్లు నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. ఈ సందర్బంగా కమాండెంట్ వెంకటరాములు మాట్లాడుతూ.. క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి, స్నేహభావన
పెంపొందడానికి దోహదం చేస్తాయన్నారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం అలవడుతాయన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వరరావు, కాళిదాస్, బాలయ్య, యూనిట్ మెడికల్ డాక్టర్ సంతోష్ సింగ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
