
- మంత్రి సీతక్క వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువవికాసం నిరుద్యోగుల పాలిట వరంగా నిలుస్తోందని, ఈ పథకం బడుగు, బలహీన వర్గాలు, పేద యువత జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, జూన్2 వ తేదీన నిరుద్యోగులకు రాజీవ్యువ వికాసం మంజూరు పత్రాలు అందజేయనున్నట్టు చెప్పారు. రూ.లక్ష లోపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం రోజు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించనున్నట్లు వివరించారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు.. మరోవైపు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. దరఖాస్తుదారులు రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.