ఈ నాలుగు మండలాలకు వెంటనే దళితబంధు

ఈ నాలుగు మండలాలకు వెంటనే దళితబంధు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని మరో నాలుగు మండలాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని నాలుగు దిక్కుల్లో  దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. దీని కోసం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని  మండలం..సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని  తిర్మలగిరి మండలం..నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం..కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు.  ఈ 4 మండలాల్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది.

సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్నినిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.