సొంత రాష్ట్రంలో పర్యటించిన తెలంగాణ గవర్నర్

సొంత రాష్ట్రంలో పర్యటించిన  తెలంగాణ గవర్నర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శనివారం తన సొంత రాష్ట్రం త్రిపురలో పర్యటించారు. గవర్నర్​గా నియమితులైన తర్వాత ఆయన త్రిపురకు తొలిసారి వెళ్లడంతో ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సాహా, మంత్రులు ఘనంగా స్వాగతం  పలికి.. సన్మానించారు. ఈస్ట్రన్ స్టేట్స్ నుంచి రాజ్యాంగ పదవి పొందిన తొలి వ్యక్తి జిష్ణు దేవ్ వర్మ అని మాణిక్ సాహా చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి గవర్నర్ పదవి ఇచ్చినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.