
నేటి కాలంలో కొందరు మహిళలు చేస్తున్న పనులు మానవత్వం చనిపోయిందా అనే స్థాయిలో ఉంటున్నాయి. కొందరు పిల్లలు లేక గుళ్లు గోపురాలు, పూజలు జపాలు, హాస్పిటళ్లు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు అంటూ తమ వంతు అనేక ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరు తల్లులు తమ చేతులారా బిడ్డలను చంపుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ALSO READ : నోట్స్ ఇస్తామని ఇంటికి పిలిచి.. స్టూడెంట్పై ఫిజిక్స్, బయాలజీ లెక్చరర్ల అఘాయిత్యం.. వాళ్ల ఫ్రెండ్ కూడా..
వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో 19 ఏళ్ల రితిక ధీరి అనే మహిళ కదులుతున్న బస్సులో బిడ్డకు జన్మనిచ్చింది. అంటే వెంటనే పుట్టిన పసికందును బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేసింది. ఆ సమయంలో తన భర్త అని చెప్పుకుంటున్న మరో వ్యక్తి అల్తాఫ్ షేక్ అనే వ్యక్తి ఆమెతో పాటే ఉన్నట్లు వెల్లడైంది. తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో వీరిద్దరూ పూణే నుంచి పర్భానీకి వెళుతున్న ఒక స్లీపర్ క్లాస్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సదరు మహిళకు నొప్పులు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను ఒక గుడ్డలో చుట్టి బయటపడేయటంతో దానిని గమనించి బస్సు డ్రైవర్ వెంటనే వారిని ఏంటదని అడిగాడు. అయితే తన భార్యకు బస్సు ప్రయాణం పడదని అందుకే వాంతులు అయ్యాయంటూ కవర్ చేసేందుకు అల్తాఫ్ ప్రయత్నించాడు.
అయితే బస్సు ప్రయాణించిన ప్రాంతంలోని గ్రామస్తుడు దానిని తెరచి చూడగా అందులో నవజాత శిశువు మరణించి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు సదరు భార్య భర్తలను అదులుపోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు మహిళను ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. బిడ్డ కిటికీలో నుంచి విసిరేసినప్పుడు గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వారిద్దరికీ పెళ్లి జరిగినట్లు ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.