రావత్ కు గవర్నర్ తమిళిసై నివాళి

రావత్ కు గవర్నర్ తమిళిసై నివాళి

చెన్నై: ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ పార్థివ దేహానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి తమిళనాడు వెల్లింగ్టన్ లో ఉన్న మద్రాస్ రెజిమెంటల్ కేంద్రానికి చేరుకున్న ఆమె బిపిన్ రావత్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు.

 

​​​
సీఎం స్టాలిన్ నివాళి
తమినాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉదయమే వెల్లింగ్టన్ లో ఉన్న మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో బిపిన్ రావత్ తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తోపాటు అశువులు బాసిన 13 మంది భౌతిక కాయాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.