గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా

గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా

హైదరాబాద్, వెలుగు:  ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు రాష్ట్ర  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరందరికీ  రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి శనివారం  ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. 

స్కీమ్ అమలుతో రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు బీమా పొందనున్నారు. ఎన్నికల ప్రచారంలో  గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 

ఈ పథకాన్ని కాంగ్రెస్ రాజస్థాన్ లో  అమలు చేసింది. దాన్ని స్టడీ చేసి చేసి, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్టరింగ్ అథారిటీ, క్లెయిమ్ రిసీవింగ్ అథారిటీని కూడా నియమించనున్నట్లు జీవోలో పేర్కొన్నారు.