- చైర్మన్‌గా వెల్ఫేర్ స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సభ్యులుగా
- కంచ ఐలయ్య, కోదండరాం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయిం బర్స్‌మెంట్ నిధుల సేకరణ, చెల్లింపుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌ను నియమించగా, వైస్ చైర్మన్‌గా ఫైనాన్స్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్‌గా సోషల్ వెల్ఫేర్ కమిషనర్‌ను అపాయింట్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవా రం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో విద్యా శాఖ సెక్రటరీతో పాటు అన్ని సంక్షేమ శాఖ సెక్రటరీల సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్, ప్రైవేటు మేనేజ్‌మెంట్ల సంఘం తరఫున ముగ్గురు సభ్యులు ఉంటారు.
అయితే, ఇటీవల ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేటు మేనేజ్‌మెంట్ల సంఘం (ఫతి)తో జరిగిన చర్చల సమయంలో దీనిపై చర్చ జరిగింది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను ట్రస్ట్ బ్యాంక్ స్కీమ్ కింద అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్‌లో రేషనలైజేషన్ తీసుకురావడానికి పారదర్శకమైన ప్రేమ్ వర్క్ రూపొందించి, హయ్యర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి సూచనలు చేయాల్సి ఉంటుంది. 3 నెలల్లో ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
