
తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్రీ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జెన్ కో రాత పరీక్ష ఉన్న రోజే.. ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో ప్రభుత్వం వాయిదా వేసింది.
నోటిఫికేషన్ ప్రకారం.. డిసెంబర్ 17వ తేదీన జెన్ కో రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అదే రోజు పోటీ పరీక్షలు ఉన్నందున అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను వాయిదా వేసేందుకు అనుమతించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని.. పరీక్ష తేదీ కోసం అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులు చూసుకోవచ్చని తెలంగాణ జెన్ కో వెల్లడించింది.