ఖమ్మం టౌన్, వెలుగు : ఎస్ బీఐ సురక్ష ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూ.51,91,237.16 చెక్కును బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా శుక్రవారం ఎంజీఎం సత్యం నాయుడు ద్వారా నామిని భార్గవికి అందజేశారు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) గా పనిచేసిన రేపల్లె చెన్నారావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.53.10 లక్షల హోం లోన్ పొందారు. ఆయన ఎస్ బీఐ సురక్ష ఇన్సూరెన్స్ పాలసీ కింద బీమా రక్షణ పొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చెన్నారావు మృతి చెందారు.
ఏబీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ వేగంగా స్పందించి రూ.51,91,237.16 మేర బీమా క్లెయిమ్‌ను పరిష్కరించి బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించింది. క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడంలో శ్రీ డి. రాజశేఖర్, చీఫ్ మేనేజర్ (మెయింటెనెన్స్) , ఆయన బృందం కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో శోభన్ బాబు, మేనేజర్ (ఎస్ఏ ఆర్సీ) కూడా విలువైన సహకారం అందించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ (సాంక్షన్స్), ఎస్ బీఐ లైఫ్‌కు చెందిన అనిల్ హాజరయ్యారు.
