గ్రూప్1 పోస్టులకు భారీగా దరఖాస్తులు

గ్రూప్1 పోస్టులకు  భారీగా దరఖాస్తులు

హైదరాబాద్ : గ్రూప్1 దరఖాస్తు గడువు ఇవ్వాల్టితో ముగియనుంది. సోమవారం రాత్రి వరకు 2,94,644 మంది అప్లై చేశారు. టీఎస్​పీఎస్సీ ఓటీఆర్​ను 1,68,658 మంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 3,45,841 మంది అప్​డేట్ చేసుకున్నారు. ఈనెల 2 నుంచి గ్రూప్1 అప్లికేషన్లు ప్రారంభం కాగా..మొత్తం 503 పోస్టులకు అప్లికేషన్లు భారీగానే అందాయి. గ్రూప్ 01 పోస్టులకు నిరుద్యోగుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. మొత్తం 503 పోస్టులున్నాయి. తెలంగాణ తొలి గ్రూప్ -01 ప్రకటన సోమవారం రాత్రి వరకు 2 లక్షల 94 వేల 644 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.


మే 31వ తేదీ మంగళవారం చివరి తేదీ కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని టీఎస్‌‌పీఎస్సీ (TSPSC) వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన గ్రూప్ 01 ప్రకటన సమయంలో వచ్చిన వాటి కన్నా.. అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు, దరఖాస్తు గడువు దగ్గర పడుతుండదంతో అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తుకు పోటెత్తారు. గ్రూప్ 01 కోసం రోజుకు సగటున పది వేల దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. సర్వర్ పై ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులుకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సీజీజీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రూప్ 01 ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాథమికంగా టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం : -

168 ఎస్సై పోస్టులకు  63439 మంది మహిళల పోటీ


కేఆర్‌‌ఎంబీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ