తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది

తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది

మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హరితహారం, కొవిడ్ వారియర్స్, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డుల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారు నిజమైన హీరోలని అభినందిస్తూ అవార్డులు ప్రదానం చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్, కన్ స్ట్రక్షన్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని, అలాగే పెట్టుబడులకు రాజధానిగా మారిందన్నారు. నిర్మాణ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుతం 1.40 లక్షల కోట్లకు చేరామని వివరించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ కు విస్తరిస్తున్నామన్నారు. స్టార్టప్ లను కూడా ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ గా మారుతోందన్నారు. 24 గంటలు నిరంతర కరెంటు.. గోదాముల పెంపుతో దేశంలో తెలంగాణ వ్యయసాయ రంగం లక్ష కోట్ల వ్యయసాయ ఉత్పత్తికి చేరుకుందన్నారు. రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఆత్మనిర్బర్, మేకిన్ ఇండియాతో మనకు ఒరిగేది ఏమీ లేదని, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును విస్మరించారు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని పట్టించుకోవడం లేదు, చివరకు వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం చేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బుల్లెట్ ట్రయిన్, హై స్పీడ్ ట్రెయిన్లు అన్నీ గుజరాత్ కే వెళ్తున్నాయని, కేటాయింపుల్లో కేంద్రం రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఒకవైపు మేకిన్ ఇండియా అని నినాదాలిస్తూ ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను ఎందుకు దిగుమతి చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఎలాంటి ప్రోత్సాహం అందించకున్నా దేశంలోనే అతిపెద్ద ఫార్మాసూటికల్ పార్కు హైదరాబాద్ లో.. టెక్స్ టైల్ పార్కు వరంగల్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిఫెన్స్, ఏరో స్పేస్ రంగానికి హైదరాబాద్ బలమైన కేంద్రంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు

టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తే.. ప్రభుత్వాలు దిగొచ్చి ధరలు తగ్గిస్తాయి