ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపుతారా : హైకోర్టు నోటీసులు

ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపుతారా : హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు  మరోసారి షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది హైకోర్టు .  జాతీయ రహదారుల (NH)పై భారీ వాహనాలు  అక్రమంగా పార్కింగ్ చేయడంపై తెలంగాణ హైకోర్టు అక్టోబరు 12 పలు  శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఎక్కడపడితే అక్కడ రోడ్లపై భారీ వాహనాలను పార్కింగ్ చేయడంపై  జరిగే నష్టాలను వివరిస్తూ... నిజామాబాద్ కు చెందిన తాపీ మేస్త్రి డి. నాగరాజు అనే వ్యక్తి  తెలంగాణ హైకోర్టుకు  సెప్టెంబర్ 23న లేఖ రాశారు.  ఈ లేఖను  సీజే అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ద్విసభ్య ధర్మాసనం పిల్ గా భావించి విచారించింది.   రవాణా మంత్రిత్వశాఖాధికారులతో  రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన శాఖలను వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  

నాగరాజు రాసిన లేఖలో  జాతీయ రహదారులపై భారీ వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేయడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  2021 డిసెంబర్ 19న తన కుమార్తె వైభవి (9) రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై మరణించిందని తెలిపారు.  కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా జాతీయరహదారి( NH ) పై ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఆయనకు, ఆయన భార్య కాళ్లకు గాయాలయ్యాయని లేఖలో పేర్కొన్నారు.   అంతేకాకుండా  హైదరాబాద్ .... కరీంనగర్ హైవే (NH) పై  ఓ వాహనంలో ప్రయాణిస్తున్న  ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు...   రోడ్డుపై  పార్క్ చేసిన భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించిన తెలంగాణ హైకోర్టు నేషనల్ హైవే రవాణా మంత్రిత్వశాఖ , తెలంగాణ సీఎస్, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీరు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, డీజీపీ లకి నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించాంది. 

ALSO READ: ఇండియన్ ఐటీ ఉద్యోగులకు జీతాలు పెంచం.. బోనస్ లు ఇవ్వం : ఐటీ కంపెనీ షాకింగ్