
పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు జులై 3కి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు పిటీషనర్ల తరఫు న్యాయవాదులు. దీనిపై జులై 3న విచారిస్తామని కోర్టు తెలిపింది.