న్యాయవాదులను అవమానించేలా సీటింగ్ ఏర్పాట్లు : తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్

న్యాయవాదులను అవమానించేలా సీటింగ్ ఏర్పాట్లు : తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్
  • తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అసహనం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన సందర్భంగా ఆదివారం రాజేందర్ నగర్​లో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులను అవమానించేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. సీట్ల కేటాయింపును తప్పుపడుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌‌‌‌కు సోమవారం అసోసియేషన్ లేఖ రాసింది. 

అసోసియేషన్ కమిటీ సభ్యులను బారికేడ్ల వెనుక కూర్చోబెట్టడం అవమానకరమని పేర్కొంది. కమిటీ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది కార్యక్రమం పూర్తికాకముందే వెళ్లిపోయారని పేర్కొంది. ఇది బార్ అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని తెలిపింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రొటోకాల్‌‌‌‌ పాటించాలని కోరింది.