హైదరాబాద్: గణేష్ నవరాత్రుల్లో భాగంగా విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు పోలీస్ డిపార్ట్ మెంట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు నిషేధం విధించింది. దీంతో సెప్టెంబర్ 16 (సోమవారం) హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ట్యాంక్ బండ్ పై చేయవద్దని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను వివరిస్తూ పోలీసులు ట్యాంక్ బండ్ పై విగ్రహాలు నిమజ్జనం చేయడాన్ని నిషేదించారు.
ALSO READ | వినాయకుడు ఏ ప్రదేశంలో జన్మించాడో తెలుసా.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) సిటీ అంతటా గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం పర్యావరణానికి అనుకూలమైన ఏర్పాట్లు చేసింది. విగ్రహాల నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో పోర్టబుల్ చెరువులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ జోన్లలో విగ్రహాల సైజును బట్టి జీహెచ్‌ఎంసీ 73 పోర్టబుల్ ఇమ్మర్షన్ చెరువులను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్, పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్లపై అధికారులు నిమజ్జనానికి భారీ క్రేన్‌లను ఏర్పాటు చేశారు.