తెలంగాణ హైకోర్టులో 176 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో 176 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో వివిధ విభాగాల్లోని 176 ఖాళీల భర్తీకి 9 జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆఫీస్‌‌ సబార్డినేట్‌‌ తో పాటు పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

పోస్టులు: మొత్తం 176 ఖాళీల్లో  హైకోర్టు సబార్డినేట్‌‌–50, సిస్టమ్‌‌ అసిస్టెంట్‌‌-–45,  ఎగ్జామినర్లు-–17, అసిస్టెంట్లు-–10,  యూడీ స్టెనోలు-–2, అసిస్టెంట్‌‌ లైబ్రేరియన్లు-–2, కంప్యూటర్‌‌ ఆపరేటర్లు-–20,  ట్రాన్స్‌‌లేటర్లు–10, కోర్టు మాస్టర్లు/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు-–20 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. 

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మార్చిలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. హాల్‌‌ టికెట్లు ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం www.tshc.gov.in వెబ్‌‌సైట్‌‌లో చూడొచ్చు.