డీఎస్సీ నోటిఫికేషన్ లో జోక్యం చేసుకోం: హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ లో జోక్యం చేసుకోం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్‌‌‌‌ టీచర్‌‌‌‌ (ఎస్జీటీ) కేటగిరీలోని స్పెషల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ టీచర్‌‌‌‌ పోస్టుల నియామక నోటిఫికేషన్‌‌‌‌ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. కనీస అర్హతల మార్కుల వ్యవహారంలో జోక్యానికి ఆస్కారం లేదని తెలిపింది. ఎస్జీటీ నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్‌‌‌‌ ఉందని చెప్పింది.

 ప్రాథమిక స్థాయిలో 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియెట్ లేదా సమానమైన పరీక్షల్లో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితరులకు 45 శాతం మార్కులతో పాటు డీఈడీ ఉండాలన్న జీవో 4ను సవాల్‌‌‌‌ చేస్తూ రిసోర్స్‌‌‌‌ పర్సన్లు కె. విజయచారి సహా 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది.