ఒక్కో బ్యాక్‌‌లాగ్‌‌ సబ్జెక్టుకు రూ.10 వేల ఫీజు పెనాల్టీనా?బ్యాక్‌‌లాగ్స్‌‌ పరీక్షల ఫీజుపై హైకోర్టు

ఒక్కో బ్యాక్‌‌లాగ్‌‌ సబ్జెక్టుకు రూ.10 వేల ఫీజు పెనాల్టీనా?బ్యాక్‌‌లాగ్స్‌‌ పరీక్షల ఫీజుపై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బ్యాక్‌‌లాగ్స్‌‌ పూర్తి చేసేందుకు నిర్వహించే పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌‌కు ఫీజు పెనాల్జీ కింద రూ.10 వేలు వసూలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారీగా పెనాల్టీ ఫీజు ఉంటే విద్య లక్ష్యం నీరుగారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–-18 విద్యా సంవత్సరం డిగ్రీ విద్యార్థులు బ్యాక్‌‌లాగ్స్‌‌ పరీక్షలు రాయడానికి ఒక్కో సబ్జెక్టుకు ఫీజు పెనాల్టీ రూ.10 వేలు చెల్లించాలన్న నిర్ణయంపై 4 వారాల్లోగా తిరిగి సమీక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ స్టాండింగ్‌‌ కమిటీని ఆదేశించింది.

 అలాగే, ఒక్కో బ్యాక్‌‌లాగ్‌‌ సబ్జెక్టుకు రూ.10 చొప్పున ఫీజు పెనాల్టీగా చెల్లించాలని 2022 డిసెంబర్‌‌‌‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌‌పై హైదరాబాద్‌‌కు చెందిన కె.ప్రమోద్‌‌ కుమార్‌‌‌‌ హైకోర్టులో సవాల్‌‌ చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌‌ ఎస్‌‌.నంద ఇటీవల తీర్పు వెలువరించారు. గతంలో ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలుగా ఉన్న ఫీజునే పిటిషనర్‌‌‌‌ నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, ఇతర విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టు ఫీజు పెనాల్టీ కింద రూ.10 వేలు వసూలు చేయడంపై పునఃసమీక్ష చేయాలని ఉస్మానియా యూనివర్సిటీకి సూచించారు.