
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. బుధవారం ( జూన్ 11 ) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. సీబీఐ తీర్పుప్పై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. రూ. 10 లక్షల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని.. ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లోద్దని ఆదేశించింది కోర్టు.
ఈ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తైన క్రమంలో బుధవారం తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది.
ఈ తీర్పును గాలి జనార్దన్‌రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేయకపోతే కర్నాటకలో తన శాసన సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గాలి జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఓఎంపీ డైరెక్టర్లు ఇద్దరూ జైలులో ఉంటే కంపెనీ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఓఎంసీ కంపెనీ వాదించింది. వాదనల అనంతరం తీర్పు వెల్లడించిన కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.