
కరోనా వైరస్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్ట్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణకు ప్రభుత్వం తరుపున చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరోనాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుంని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విషయంలో తాము గతంలో పలు ఆదేశాలిచ్చామని, ఆ ఆదేశాల్ని ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వడం లేదని ప్రశ్నించింది.
రెండు వారాల్లో కరోనా కు సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన అదేశాల్ని పూర్తి చేయాలని హైకోర్టు అదేశించింది. ఇక రాష్ట్రం లో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్ట్ .. ఎంతమంది ప్రైమరి కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ ఉన్న బాధితులకు పరీక్షలు చేశారో తెలపాలని సూచించింది.
అత్యధిక ఫీజుల వసూలు, ట్రీట్మెంట్ విషయంలో ప్రజల ఫిర్యాదుల్ని తప్పని సరిగా తీసుకోవాలని, నోటీసులచ్చిన సదరు ఆస్పత్రులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రైవేట్ ఆస్పత్రులు సైతం ప్రభుత్వ జీవోను ఫాలో కావాలని, విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రతీ ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద కరోనా ట్రీట్మెంట్ కు సంబంధించిన ఫీజుల బోర్డ్ ల ద్వారా డిస్ ప్లే చేయాలని చెప్పింది.
అదేవిధంగా ప్రభుత్వం కల్పించిన వసతులను వినియోగించుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత మందికి ఉచితంగా ట్రీట్మెంట్ అందించాయో చెప్పాలని హైకోర్ట్ విచారణ సందర్భంగా పునరుద్ఘాటించింది.
ఢిల్లీ ప్రభుత్వం కరోనా పేషెంట్స్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న బెడ్స్ ను ఏ విధంగా తీసుకుందో వివరించిన హైకోర్ట్ .. తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా ప్రైవేట్ ఆస్పత్రుల బెడ్స్ ను ఎందుకు తీసుకోలేదో చెప్పాలంది.
చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలను ఫిర్యాదులు తీసుకోవలన్న హైకోర్టు…కొంత మంది ఎన్జీవోలు , సివిల్ సొసైటీ తో కలిపి ఐసోలోషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రసూల్ పూర్ లోని హాకీ మైదానం ను పరీశీలించాలని తెలిపింది.
తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేస్తూ ఆదే రోజు విచారణకు వైద్య శాఖ అధికారులు హాజరు కావాలని హైకోర్టు అదేశించింది.