గ్రూప్ 1 పై ఇవాళ ( సెప్టెంబర్ 9 ) హైకోర్టు తీర్పు

గ్రూప్ 1 పై ఇవాళ ( సెప్టెంబర్ 9 ) హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 పరీక్షల వ్యవహా రంపై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పనుంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 పరీక్షల నిర్వహణను సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పిటిషన్లపై గతంలో హైకోర్టు విచారణ పూర్తి చేసింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి కనుక పరీక్షలను రద్దు చేయాలని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయినందున రద్దు చేయవద్దని మరికొందరు పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు జులై 7వ తేదీకి తీర్పు వాయిదా వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. 

అర్హతలేనివారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది తెలిపారు. 

మూల్యాంకనంలో సందేహాలున్నచోట రెండు, మూడు సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు. మూల్యాంకనంలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా పర్యవేక్షణ మధ్య జరిగిందని వెల్లడిస్తూ. ఆధారాల్లేని ఆరోపణలతో చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొట్టివేయాలని కోరారు.