తొందర్లోనే 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

తొందర్లోనే 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడే లేరని అన్నారు. ముస్లిం మైనారిటీల కోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ సెక్యులరిస్టు అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో మత ఘర్షణలు జరిగాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడున్నరేండ్లలో ఎక్కడా ఘర్షణలు జరగలేదని మహమూద్ అలీ చెప్పారు. కాంగ్రెస్ 65 ఏండ్ల పాలనలో విద్య కు ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ వచ్చినంక 240 మైనారిటీ స్కూల్స్ తెచ్చి.. ఒక్కో విద్యార్థిపై  రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో తొందర్లోనే 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రానున్నాయని, ఆ ఎగ్జామ్స్ ఉర్దూలో కూడా రాసే అవకాశం ఉంటుందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మొగిలయ్యకు వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం