దశాబ్ది వేడుకల ధూంధాం

దశాబ్ది వేడుకల ధూంధాం

తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ధూంధాంగా ప్రారంభంఅయ్యాయి.  శుక్రవారం అధికార యంత్రాగంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, స్టూడెంట్, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మెదక్‌లో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరుల స్తూపానికి నివాళులు ఆర్పించారు. 

అనంతరం అమరువీరుల కుటుంబాలకు సన్మానం చేశారు. స్టూడెంట్ల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కాగా, బీజేపీ, బీఆర్‌‌ఎస్‌ నేతలు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోకు దండ వేస్తే.. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.   - నెట్‌వర్క్‌, వెలుగు