
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలకు ఫస్టియర్ ఎగ్జామ్స్ తో ప్రారంభమైంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5గంటల 30 నిమిషాల వరకు సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్టియర్ విద్యార్ధులు 3లక్షల 874 మంది, సెకండియర్ విద్యార్ధులు లక్షా 62వేల 389 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 857 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 15వేల 45 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు.