మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ

మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ
  •     అదే నెల 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్
  •     ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన వారికి, తక్కువ మార్కులు వచ్చి ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవాలనుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే13 నుంచి 21 వరకు ఎగ్జామ్స్‌ ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మే 22 నుంచి మే25 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి.  

ప్రతిరోజూ రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. మే 26న ఉదయం 10 గంటల నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్, అదే రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది. మే 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల13 నుంచి 20 వరకు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్  

మే 13– సెకండ్ లాంగ్వేజ్ 
మే 14 – ఇంగ్లిష్‌
మే 15 – మ్యాథ్స్ ఏ, బోట‌నీ , పొలిటిక‌ల్ సైన్స్
మే 16– మ్యాథ్స్ బీ, జువాల‌జీ, హిస్టరీ 
మే 18 – ఫిజిక్స్, ఎకనామిక్స్ 
మే 19 – కెమిస్ట్రీ, కామ‌ర్స్ 
మే 20 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 
మే 21 – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ