ఇన్ కమ్ సర్టిఫికెట్ అప్లై చేయాలా..క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా.. ఇంటి వద్దకే మీసేవ

ఇన్ కమ్ సర్టిఫికెట్ అప్లై చేయాలా..క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా.. ఇంటి వద్దకే మీసేవ

హైదరాబాద్, వెలుగు: ఇన్​కమ్​సర్టిఫికెట్​అప్లై చేయాలా.. క్యాస్ట్​సర్టిఫికెట్​కావాలా.. ఆధార్​లో మార్పులు చేయాలా..? ఇకపై అన్ని ఇంటి దగ్గరే చేసుకోవచ్చు.. మీసేవ చుట్టూ తిరగాల్సిన పనే లేదు. ఇక నుంచి మీసేవ సర్వీసులను ఇంటి దగ్గర్నే అందిస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్​అండ్​కమ్యూనికేషన్స్​శాఖ ‘మీసేవ డోర్​స్టెప్​డెలివరీ’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీసేవ ప్రతినిధి ఇంటికే వచ్చి కావాల్సిన సర్టిఫికెట్ ప్రాసెస్ చేస్తారు.

 ఇన్​కమ్​సర్టిఫికెట్, క్యాస్ట్​సర్టిఫికెట్, రెసిడెన్స్​సర్టిఫికెట్, బర్త్, డెత్​సర్టిఫికెట్లు, ఆధార్​ నమోదు, ఆధార్​అప్​డేట్​వంటి అత్యంత కీలకమైన సేవలను డోర్​స్టెప్​డెలివరీ ద్వారా అందిస్తున్నారు. తొలి నెలలోనే ప్రజల నుంచి టోల్​ఫ్రీ నంబర్​1100 నంబర్​కు 3,885 కాల్స్ వచ్చాయన్నారు. ఈ డోర్‌‌స్టెప్ సేవలు క్యూర్ పరిధిలోని ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా, దశలవారీగా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.