కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్!

కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్!

తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తుచేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్దం అంటూ స్మిత ట్వీట్ లో పేర్కొన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. 

2001లో ట్రైనీ కలెక్టర్ ఐఏస్ విధుల్లో చేరిన స్మితా సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పనీతీరులో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపును పొందారు. తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.