
సాధారణ ఎన్నికల ముందు నర్సాపూర్ ప్రచారసభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేశారు. జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని కోరారు. టీఎన్జీవో సహా అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షుడు ఫజులుద్దీన్, మెదక్ యూనిట్ అధ్యక్షుడు రామా గౌడ్, ట్రేస నాయకుడు లక్ష్మణ్, సంతోష్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
మెదక్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ చౌరస్తా వద్ద అంబేద్కర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, సీనియర్ కాంగ్రెస్ నేత హన్మంతరావు, డీబీఎఫ్ నేత శంకర్ పాల్గొన్నారు.
చౌరస్తా వద్ద జనం భారీగా చేరుకున్నారు. జై భీమ్ నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. విగ్రహ కమిటీ నాయకుడు, టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, గంగాధర్, షేక్ అహ్మద్, సుధాకర్, నాగరాజు. గోపాల్ నాయక్, దయా సాగర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పీసీసీ నేతలు రాజిరెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.
ఈఎస్ఐకి సొంత భవనం మంజూరుచేయాలి
పటాన్చెరు(గుమ్మడిదల): గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో అద్దె భవనంలో ఉన్న ఈఎస్ఐ కేంద్రానికి సొంత భవనంతో పాటు ఫైర్స్టేషన్మంజూరు చేయాలని గుమ్మడిదల కాంగ్రెస్ నేతలు మంత్రి వివేక్‌వెంకట స్వామిని కోరారు.
మంత్రి గుమ్మడిదల మీదుగా మెదక్ జిల్లా నర్సాపూర్ వెళ్తుండగా గుమ్మడిదలలో ఆయన కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. కానుకుంట చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి జై భీం అంటూ నినాదాలు చేశారు. గుమ్మడిదలలో ఆయన ఆగిన సందర్బంగా దివంగత నేత గడ్డం వెంకటస్వామి ఫొటోను మాజీ సర్పంచ్ మండల తులసీదాస్ మంత్రి వివేక్‌కు అందజేశారు.