
సంగారెడ్డి, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పట్టణాల సర్వే ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల ర్యాంకింగ్ విడుదల చేశారు. పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరించడం, సేకరించిన వ్యర్ధాలను ప్రాసెస్ చేయడం వంటి అంశాలను సర్వేలో ప్రామాణికంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేక్షణ్ సర్వే ఫలితాలను రాష్ట్రపతి ముర్ము గురువారం రిలీజ్ చేశారు. ఇందులో జిల్లాలో వాటి స్థానాలను పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 18వ స్థానంలో ఉంది.
ఆందోల్-జోగిపేట్ మున్సిపాలిటీ చివరి స్థానంలో నిలవగా రాష్ట్రంలో 1,149వ స్థానానికి చేరింది. జిల్లాలో సెకండ్ ప్లేస్ లో అమీన్పూర్, థర్డ్ ప్లేస్ లో బొల్లారం, ఫోర్త్ ప్లేస్ లో సదాశివపేట, ఫిఫ్త్ ప్లేస్ లో జహీరాబాద్, సిక్స్త్ ప్లేస్ లో నారాయణఖేడ్, సెవెంత్ ప్లేస్ లో సంగారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. 2023లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ర్యాంకింగ్ చూస్తే రాష్ట్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీ 17వ స్థానంలో ఉండగా, ఈసారి 94వ ర్యాంకింగ్ కు పడిపోయింది.