
మునిపల్లి, వెలుగు: మునిపల్లి పీహెచ్సీ, తహసీల్దార్ఆఫీసును కలెక్టర్ ప్రావీణ్య గురువారం తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వ్యాక్సినేషన్, జ్వరం సర్వేను పరిశీలించి మెడికల్ స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు . అనంతరం తహసీల్దార్ఆఫీసును తనిఖీ చేసి భూభారతి ప్రోగ్రెస్, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రెస్ పై అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ..రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ గంగా భవాని, ఎంపీడీఓ హరినందన్ రావు, డాక్టర్ సంధ్యారాణి, ఎంపీఓ అండాలమ్మ, డీటీ ప్రదీప్, మాజీ సర్పంచ్ రమేశ్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి యాదయ్య, రమేశ్ గౌడ్, నరేశ్ ఉన్నారు.