దుర్వినియోగంలో దేశంలో తెలంగాణది థర్డ్ ప్లేస్

దుర్వినియోగంలో దేశంలో తెలంగాణది థర్డ్ ప్లేస్
  • మొదటి, రెండో స్థానాల్లో తమిళనాడు, ఏపీ 
  • పనులపై ఫిర్యాదుల్లో ఐదో స్థానంలో రాష్ట్రం 
  • సోషల్ ఆడిట్స్ ఇన్ ఇండియా రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పథకంలో పని చేయని కూలీలకు డబ్బులు చెల్లించడం, మెటీరియల్ కొనుగోళ్లకు ధరకు మించి ఖర్చుపెట్టడం, లెక్కల్లో తేడాలు, అనుమతులు లేని పనులు నిర్వహించడం, నిబంధనలను అతిక్రమించడం, జాబ్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంలో మొదటి, రెండో స్థానాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉండగా, ఆ తర్వాతి స్థానం తెలంగాణకే దక్కింది. ఉపాధి హామీకి సంబంధించి దేశ వ్యాప్తంగా 17,76,841 సమస్యలు రిజిష్టర్ కాగా, ఎక్కువ రిజిష్టర్ అయిన మొదటి 5 రాష్ట్రాలుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జార్ఖండ్ నిలిచాయి. మొత్తం నిధుల దుర్వినియోగంలో 92 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరగడం గమనార్హం. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఎన్ఐఆర్డీ పీఆర్ లో స్టేటస్ ఆఫ్ సోషల్ ఆడిట్స్ ఇన్ ఇండియా –2021 పేరిట నిర్వహించిన స్టడీ రిపోర్టు ఈ వివరాలను ఇటీవలే బయటపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులపై జరుగుతున్న సోషల్ ఆడిట్స్, నిధుల దుర్వినియోగం, బాధ్యులపై తీసుకున్న శాఖాపరమైన చర్యలు, రికవరీ గురించిన వివరాలను ఈ రిపోర్టులో వెల్లడించారు.

90 శాతం నిధుల దుర్వినియోగం సౌత్ లోనే
సోషల్ ఆడిట్ ప్రారంభం నుంచి దేశంలో రూ.1784 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఎన్ఐఆర్డీ పీఆర్  రీసెర్చ్​లో తేలింది. ఇలా దుర్వినియోగమైన నిధుల్లో 90 శాతం తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినవేనని వెల్లడైంది. అలాగే జార్ఖండ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, పంజాబ్, త్రిపురలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. రూ.1784 కోట్ల నిధులు పక్కదారిపడితే కేవలం 10.4 శాతం నిధులనే రికవరీ చేయడం ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. నిధుల దుర్వినియోగంలో దాదాపు 4 లక్షలకు పైగా ఫిర్యాదులొస్తే.. దేశవ్యాప్తంగా 95 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదుకాగా, 1094 మంది సస్పెండయ్యారు. మరో 629 మంది ఉద్యోగులను సర్వీస్ నుంచి టర్మినేట్ చేశారు. 16,214 మంది ఉద్యోగులకు పెనాల్టీ వేశారు. బాధ్యులపై చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లోనూ ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ ముందువరుసలో ఉన్నాయి.

అత్యధిక రికవరీ రేటు తెలంగాణలోనే

దుర్వినియోగమైన మొత్తంలో దేశంలో సగటున 10.4 శాతం నిధులను మాత్రమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రికవరీ చేశాయి. తెలంగాణలో 2010 నుంచి 2021 వరకు రూ.61,73,94,455 పక్కదారిపట్టినట్లు గుర్తించగా.. ఇందులో 22,94,52,671(37.2) రికవరీ చేశారు. దేశసగటుతో పోలిస్తే రికవరీలో తెలంగాణ ముందుంది. రాష్ట్రంలో పని చేయని కూలీలకు చెల్లించినట్లు 49,188 ఇష్యూస్ రిపోర్టు కాగా, ప్రైవేట్ భూముల్లో పనులు చేపట్టేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు 30,421 ఫిర్యాదులు అందాయి. జాబ్ కార్డుల సమస్యపై 94,468 కంప్లయింట్లు, జాబ్ కార్డ్ అందలేదని 23,161 వచ్చాయి. అన్ని కలిపి 1,97,238 ఫిర్యాదులు అందాయి.

రాష్ట్రంలో 60 వేలకు పైగా ఇష్యూస్

తెలంగాణలో 2019–20లో మొత్తం 65,438 సమస్యలు రిపోర్ట్ కాగా, అధికారులు 10,081 సమస్యలను పరిష్కరించారు. 4,830 మందికి ఫైన్ వేశారు. 31,671 మంది సిబ్బందిని హెచ్చరించారు. 175 మందిని సస్పెండ్ చేయగా, 70 మందిని టర్మినేట్ చేశారు. 2020–21లో దేశవ్యాప్తంగా మొత్తం 2,06,073 సమస్యలు రిపోర్ట్ కాగా అందులో 60,204 ఇష్యూస్ తెలంగాణకు చెందినవే ఉన్నాయి. ఇందులో 755 సమస్యలను మాత్రమే పరిష్కరించారు. 1,334 మంది సిబ్బంది, అధికారులకు ఫైన్ వేశారు. 27,043 మంది సిబ్బందిని హెచ్చరించారు. 31 మందిని సస్పెండ్ చేయగా, 37 మందిని జాబ్ నుంచి తొలగించారు. 

చెల్లింపుల్లోనూ జాప్యం

అడిగిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలని ఉపాధి హామీ చట్టంలో ఉంది. ఇందుకు ప్రతి గ్రామపంచాయతీలో వర్క్ డిమాండ్ రిజిష్టర్​ను మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 64.88 గ్రామాల్లో ఆ సదుపాయమే లేకపోవడం చట్టం అమలులో ఎంత నిర్లక్ష్యం ఉందో తెలుస్తోంది. కూలీలకు డబ్బుల చెల్లింపుల్లో సమస్యలున్నాయని 8,833(69.17 శాతం) గ్రామాల్లో కూలీలు చెప్పగా, ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని, 1,770(13.86%) గ్రామాల్లో చెప్పారు, 2166 (16.96 శాతం) గ్రామాల్లో మాత్రమే ఎలాంటి సమస్య లేదని తెలిపారు.