కాంగ్రెస్ బీసీల ద్రోహి.. ఆ పార్టీ గద్దెలు కూల్చండి: కవిత

కాంగ్రెస్ బీసీల ద్రోహి.. ఆ పార్టీ గద్దెలు కూల్చండి: కవిత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ బీసీల ద్రోహి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ఆ పార్టీ.. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. బీసీలకు అన్యాయం చేస్తున్న ఆ పార్టీ గద్దెలను కూలగొట్టాలని వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.

 కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన మొత్తం తప్పుల తడక అని ఆమె విమర్శించారు. ‘‘కొత్తగూడెం జిల్లాలో 25 పంచాయతీల్లో ఒక్క దానికీ బీసీ రిజర్వేషన్ దక్కలేదు. ప్రభుత్వం కులగణన సరిగా చేసి ఉంటే, అక్కడ సగం గ్రామాల్లో బీసీ రిజర్వేషన్ వచ్చేది. మహబూబాబాద్ జిల్లాలోనూ బీసీల స్థానాలు తగ్గాయి. కులగణనలో బీసీల జనాభాను ఐదారు శాతం తగ్గించారు. దీంతో బీసీల రిజర్వేషన్లు తగ్గాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 5 గ్రామాల్లో ఎస్టీలే లేరు. 

కానీ ఆ గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించారు. మొత్తం 12,735 గ్రామ పంచాయితీల్లో ఏజెన్సీ ప్రాంతాలను తీసేస్తే 10, 223 పంచాయతీలు ఉంటాయి. వాటిల్లో బీసీలకు ఇస్తున్నది 2,126  మాత్రమే. అంటే బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ 21.29 శాతమే. నిజానికి కాంగ్రెస్  చెప్పిన దాని ప్రకారం దీనికి డబుల్ రిజర్వేషన్లు రావాలి. కానీ తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ పార్టీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నది” అని మండిపడ్డారు. జనరల్ స్థానాల్లో బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. బీసీల గెలుపు కోసం బీసీ వర్గాలు ఫైట్ చేయాలని కోరారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్, బీజేపీ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల తప్పిదాలను సరిచేయాలని, అవసరమైతే ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ కుట్ర

సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల అర్హత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తాము రిటైర్ అవుతామని..తమ పిల్లలకు ఆ డిపెండెంట్ పోస్టు ఇప్పించాలని 129 మంది సింగరేణి కార్మికులు దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తుచేశారు.