కొండారెడ్డిపల్లిలో ఈదమ్మ ఆలయ పున:ప్రతిష్ట

కొండారెడ్డిపల్లిలో ఈదమ్మ ఆలయ పున:ప్రతిష్ట

వంగూరు, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బుధవారం ఈదమ్మ ఆలయ పున:ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఆయన సోదరుడు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎనుముల కృష్ణారెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. 

ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కేవీఎన్​.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ భీమమ్మ లాలు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ వేమారెడ్డి, నాయకులు జగదీశ్వర్​రెడ్డి, పులిజాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.