
- ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
న్యూఢిల్లీ, వెలుగు: దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే.. దేశప్రగతి సాధ్యమని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రగతి మైదాన్ నుంచి ప్రారంభమైన తిరంగ ర్యాలీని ఉపరాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖి పలువురు ఎంపీలు, వివిధ యూనివర్సిటీల స్టూడెండ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినపుడే దేశం పురోగతి సాధిస్తుందన్నారు. తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 15 ఆగస్టు నాడు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు.. ఇలా ప్రతిచోటా జాతీయ జెండా రెపరెపలాడాలని దేశ ప్రజలను కోరారు.