బిడ్డలారా.. గంజాయికి బానిసవ్వొద్దు వీడియో సాంగ్షూటింగ్ప్రారంభం

బిడ్డలారా.. గంజాయికి బానిసవ్వొద్దు  వీడియో సాంగ్షూటింగ్ప్రారంభం

చేవెళ్ల, వెలుగు: భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కొడుకులారా.. బిడ్డలారా, దారి తప్పుతున్నారో.. మహమ్మారి గంజాయికి బానిసలు అవుతున్నారో’ పాట షూటింగ్ ప్రారంభమైంది.శుక్రవారం మొయినాబాద్‌‌ మున్సిపల్ పరిధిలోని హిమత్‌‌నగర్‌‌లోని చైతన్య డ్రీమ్ యూనివర్సిటీలో షూటింగ్  నిర్వహించారు. 

ప్రొఫెసర్​ కోదండరాం క్లాప్ కొట్టగా.. మా భూమి సినిమా డైరెక్టర్ బి.నర్సింగ్ రావు కెమెరా ఆన్ చేశారు. అనంతరం సినీ నటి ఆమని తన నటన ద్వారా విద్యార్థులకు గంజాయిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత, చైతన్య డ్రీమ్ యూనివర్సిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు, మేకగూడెం బిక్షపతి పాల్గొన్నారు.