తిట్టిన పార్టే నాయకులకు తీపాయె!

తిట్టిన పార్టే  నాయకులకు తీపాయె!
  • దుమ్మెత్తిపోసిన  పార్టీలోకే దూకిన నేతలు
  • వచ్చీరాగానే  టికెటిచ్చి బరిలోకి దింపిన పార్టీలు
  • అన్ని పార్టీల్లోనూ సగం మంది అలాంటి వారే!
  • నాడు తిట్టుకు న్నోళ్లే.. నేడు పొగుడుకుంటు న్న తీరు
  • లోక్ సభ ఎన్నికల వేళ అయోమయంలో జనం

నిన్నామొన్నటి వరకు దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రత్యర్థిపార్టీని తిట్టిపోశారు. ఉన్నవి లేవని పోగేసి ఆరోపణలు గుప్పించుకున్నారు. చిత్తుచిత్తుగా ఓడించాలని గట్టిగాప్రచారం చేసుకున్నారు. ఫలితాలొచ్చేశాయి. అసెంబ్లీఎన్ని కల వేడి చల్లారింది.ఈ లోపే లోక్ సభ నగారా మోగింది. ఫ్యూచర్‌ ప్లాన్‌ సెట్‌ చేసుకున్నారు. ప్లేట్‌ మార్చేశారు. సీన్‌ రివర్స్ అయింది. తిట్టిన పార్టే నేడు తీపయ్యింది. గతంలో ఎదుర్కొన్న పార్టే నుంచి టికెట్‌తెచ్చుకుని బరిలోకి దిగారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేందుకు ఇవన్నీ ఉదాహరణలే..

కాంగ్రెస్ లో వీళ్లే

  • చేవెళ్ల నుంచి 2014 లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లోకి మారారు. నాలుగేళ్లపాటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన ప్రస్తుతం హస్తం గుర్తు మీద పోటీ చేయాల్సి వచ్చింది.
  • ఆదిలాబాద్ లో రమేష్‌ రాథోడ్ అదే పరిస్థితి.2014లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు.
  • 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు.
  • దొమ్మాటి సాంబయ్య టీడీపీ నుంచి 2009 ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీగా, 2014లో స్టేషన్ ఘన్ పూర్‌ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించిన దొమ్మాటి.. ప్రస్తుతం అదే పార్టీ నుంచి వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తున్నారు.అప్పట్లో టీడీపీలో ఉన్న ఫిరోజ్‌ ఖాన్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌తరఫున హైదరాబాద్ నుంచి బరిలో ఉన్నారు.

కారెక్కిన వారూ ఎక్కువే

  • ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి బరిలోకి దిగుతున్న వారూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలోకి చేరే వరకూ టీఆర్‌ఎస్ పై నామా దుమ్మెత్తిపోశారు. కానీ ఇప్పుడు అదే టీఆర్‌ఎస్‌ నుంచి ఖమ్మం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
  • టీఆర్‌ఎస్‌కు పూర్తి వ్యతిరేకంగా, ప్రత్యర్థిగా కొనసాగిన నేతకాని వెంకటేష్‌ పరిస్థితీ అంతే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను తిట్టి పోశారు. ఇటీవల అదే టీఆర్‌ఎస్‌లో చేరి పెద్దపల్లి నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు.
  • మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్‌ కవిత గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు.
  • 2014లో టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి, నల్గొండ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, గుత్తాకు రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పదవి, ఇటీవల ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.

కమలం పార్టీలోనూ ఉన్నారు

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిన ఆమె ప్రస్తుతం మహబూబ్ నగర్‌ నుంచి కమలం గుర్తుపై పోటీచేస్తున్నారు.
  •  మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు ఇటీవల ఎంపీ టికెట్‌ హామీతో బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్‌అభ్యర్థిగా బోథ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిఓడారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీఅభ్యర్థిగా బరిలో ఉన్నారు.
  •  హుస్సేన్‌ నాయక్‌ సైతం అసెంబ్లీ ఎన్నికలకుముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. కమలంపార్టీ అభ్యర్థిగా మహబూబాబాద్‌ నుంచి పోటీ చేసిఓడారు. ప్రస్తుతం అదే పార్టీ నుంచి మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

ఎమ్మెల్యే టూ ఎంపీ

ఇటీవలి అసెంబ్లీ ఎన్ని కల్లో ఓడిన చాలా మందిలోక్ భ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్య-ర్థుల్లో ఎక్కువ మంది వారే. కాంగ్రెస్‌ నుంచి కోమ-టిరెడ్డి వెంకట్‌రెడ్ డి, రేవంత్‌ రెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌, వం-శీచంద్ రెడ్ డి, బలరామ్‌ నాయక్‌ బరిలో ఉన్నారు.హుజూర్‌నగర్‌ నుంచి గెలిచిన ఉత్తమ్‌ కూడానల్గ ొండ లోక్ భ బరిలో నిలిచారు. బీజేపీ నుంచికిషన్‌ రెడ్డి, డీకే అరుణ, సోయం బాపూరావు, బండిసంజయ్‌, రఘునందన్‌రావు, రాంచందర్‌రావు,హుస్సేన్‌ నాయక్‌ కూడా పోటీలో ఉన్నారు.