ఆదివాసీ కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీలో సీతక్క, బలరాం నాయక్‌‌

ఆదివాసీ కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీలో సీతక్క, బలరాం నాయక్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ అడ్వైజరీ కౌన్సిల్‌‌లో తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌‌కు చోటు దక్కింది. అలాగే, ఆదివాసీ కాంగ్రెస్ కౌన్సిల్‌‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా పోడెం వీరయ్యకు అవకాశం కల్పించారు. 

ఈ మేరకు కమిటీ చైర్మన్ డాక్టర్ విక్రాంత్ భురియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆదివాసీ అడ్వైజరీ కమిటీలో వివిధ రాష్ట్రాల నుంచి 43 మందికి, ఆదివాసీ కాంగ్రెస్ అడ్వైజరీ ‌‌కమిటీ స్పెషల్ ఇన్వైటీస్‌‌గా 39 మందికి చోటు కల్పించినట్లుగా తెలిపారు. వీరితో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి‌‌ మరో 19 మందికి కూడా అవకాశం కల్పించారు.